Sridevi: శ్రీదేవి మృతిపై దుబాయ్ వైద్యులు ప్రాథమిక నివేదిక మాత్రమే ఇచ్చారు : భారత పోలీస్ వర్గాలు
- ఈ నివేదికలో ‘యాక్సిడెంటల్ డ్రౌనింగ్’ అనే పదాన్ని వాడారు
- సాధారణంగా ఇలాంటి పదాన్ని ఆ విధంగా ఉపయోగించరు
- శ్రీదేవి మృతి ప్రమాదమా? కుట్ర? ఆత్మహత్య? అనేది పూర్తి స్థాయి నివేదికలో వెల్లడవుతుంది
శ్రీదేవి మృతిపై దుబాయ్ వైద్యులు ప్రాథమిక నివేదిక మాత్రమే ఇచ్చారని భారత పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నివేదికలో ‘యాక్సిడెంటల్ డ్రౌనింగ్’ (ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడం) అనే పదాన్ని వాడారని, సాధారణంగా ఇలాంటి పదాన్ని ఆ విధంగా ఉపయోగించరని అన్నారు. శ్రీదేవి మృతి ప్రమాదమా? కుట్ర? ఆత్మహత్య? అనే విషయం పూర్తి స్థాయి నివేదికలోనే వెల్లడవుతుందని, కెమికల్, విస్రా విశ్లేషణ ద్వారా ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారిస్తారని భారత పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, యాక్సిడెంటల్ డ్రౌనింగ్ కారణంగా శ్రీదేవి బోనీ కపూర్ అయ్యప్పన్ మృతి చెందినట్టు దుబాయ్ వైద్యుల ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికలో అచ్చుతప్పులు ఉండటం గమనార్హం. ‘ACCIDENTAL DROWNING’కు బదులు ‘ACCIDENTAL DRAWNING’ అని ఆ నివేదికలో ఉంది. దీంతో, ఈ నివేదిక కొత్త సందేహాలను రేకెత్తిస్తోంది.