maharastra: తన ప్రసంగాన్ని ‘మరాఠీ’లోకి ఎందుకు అనువదించలేదంటూ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆగ్రహం!
- ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన విద్యాసాగర్ రావు
- ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి
- శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్ కు ఓ లేఖ రాసిన గవర్నర్
మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రసంగాన్ని మరాఠీ భాషలోకి అనువదించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఈరోజు ఆయన ప్రసంగించారు. అయితే, ఈ ప్రసంగాన్ని మరాఠీ భాషలోకి అనువదించేందుకు ఎవరూ ప్రయత్నించకపోవడంపై ఆయన ప్రశ్నించారు. ఇలా ఎందుకు జరిగిందంటూ శాసనసభ స్పీకర్ హరిభౌ బగదేకు, మండలి చైర్మన్ రామ్ రాజే నాయక్ కు ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు.
‘ఈరోజు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి నేను ప్రసంగిస్తున్న సమయంలో నా ప్రసంగాన్ని మరాఠీలోకి అనువాదం చేయలేదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఏం చర్యలు తీసుకున్నారో నాకు తెలియజేయాలి..’ అని ఆ లేఖలో విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.