Sridevi: శ్రీదేవి అంత్యక్రియల వివరాలు
- లోఖండ్ వాలాలోని గ్రీన్ ఏకర్స్ లో నివాసానికి చేరిన శ్రీదేవి పార్థివదేహం
- అభిమానుల సందర్శనార్థం సెలెబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ కు తరలిస్తారు
- 3.30 గంటలకు అంత్యక్రియలు
శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని లోఖండ్ వాలాలోని గ్రీన్ ఏకర్స్ లోని నివాసానికి శ్రీదేవి భౌతిక కాయాన్ని చేర్చారు. బంధువులు, సినీ ప్రముఖుల సందర్శన అనంతరం ఉదయం 9 గంటలకు సెలెబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ కు ఆమె పార్థివదేహాన్ని చేర్చనున్నారు.
ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అక్కడ అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత 12:30 నుంచి 1:30 వరకు అక్కడే కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుండగా, 3:30 గంటలకు విల్లేపార్లేలోని సేవా సమాజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. శ్రీదేవికి తెలుపు అంటే ఉన్న ప్రీతికారణంగా ఏర్పాట్లన్నీ తెలుపు రంగులో ఉండేలా శ్రద్ధతీసుకున్నారు.