gold: భారీగా తగ్గిన బంగారం ధర!
- అంతర్జాతీయ పరిస్థితులు, బంగారు నగల దుకాణదారుల నుంచి తగ్గిన డిమాండ్
- ఈ రోజు 10 గ్రాముల పసిడి రూ.460 తగ్గి రూ.31,390గా నమోదు
- కిలో వెండి ధర రూ.250 తగ్గి, రూ.39,300
అంతర్జాతీయ పరిస్థితులు, బంగారు నగల దుకాణదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ఈ రోజు బంగారం ధర 460 రూపాయలు పడిపోయి పది గ్రాముల పసిడి ధర రూ.31,390కు చేరింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు 1 శాతం తగ్గాయి. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం ధరల బాటలోనే పయనించి కేజీ వెండి ధర రూ.250 తగ్గి, రూ.39,300గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వెండి ధరలు తగ్గిపోయాయి. నాలుగు రోజులు బంగారం, వెండి ధరలు పెరుగుతూ వచ్చి ఈ రోజు అమాంతం పడిపోయాయి.