Prime Minister: ఫ్రెండ్ విడుదల కోసం పోలీసులతో యువతుల వాగ్వాదం...వీడియో వైరల్
- విచారణకు అడ్డు తగులుతున్నారని పోలీసుల ఆరోపణ
- ముగ్గురు యువతుల అరెస్టు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. అరెస్టు చేసిన తమ ఫ్రెండ్‌ని విడుదల చేయాలంటూ అహ్మదాబాద్‌లోని నరోదా పోలీసు స్టేషన్ వద్ద 15 మంది యువతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు తమపై భౌతిక దాడులు చేశారని వారు ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తమ విచారణకు అడ్డుతగులుతున్నారంటూ యువతులపై కేసు నమోదు చేసి ముగ్గుర్ని అరెస్టు చేశామని పోలీసులు చెప్పడం గమనార్హం.
వివరాల్లోకెళితే...అహ్మదాబాద్‌లో 15 మంది యువతులు ముగ్గురు యువకులతో కలిసి ఉంటున్నారు. ముగ్గురిలో ఒకరు తప్పతాగి తమ ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలిగించాడు. బాధితులిచ్చిన ఫిర్యాదుతో నిందితుడు వినోద్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న యువతులు పోలీసు స్టేషన్ చేరుకున్నారు. తమ మిత్రుడిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యువతులు తమ విచారణకు అడ్డుతగులుతున్నారని, పోలీసు స్టేషన్ ఎదుట నానాయాగీ చేస్తున్నారని పోలీసులు ఆరోపించారు. వారిలో ముగ్గురు యువతులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
Visuals from Naroda police station, Ahmedabad. Police allegedly took Rs 3000 bribe from Eve teaser and let him off. And filed an FIR against someone who spoke for the girls. #BetiBacahoBetiPadhao pic.twitter.com/KqAAxVNTNR
— Unofficial Sususwamy (@swamv39) February 27, 2018