Nirav Modi: నీరవ్ మోదీకి సీబీఐ మెయిల్.. బదులిచ్చిన నీరవ్!
- ఏ దేశంలో ఉంటే ఆ దేశ దౌత్య కార్యాలయంలో సమాచారం ఇవ్వాలి- సీబీఐ
- ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు మేము చేస్తాం
- చాలా బిజీగా ఉన్నాను- నీరవ్ మోదీ
- భారత్‌కి రాలేను
వ్యాపారవేత్త నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను కోట్లాది రూపాయలకు మోసం చేసి విదేశాలకు పారిపోయిన వైనం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఆయనకు ఈ రోజు సీబీఐ ఓ ఈమెయిల్ పంపి విచారణకు హాజరు కావాలని సూచించింది. ఆయన ఏ దేశంలో ఉంటే ఆ దేశ దౌత్య కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని, ఆయన ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు తాము చేస్తామని చెప్పింది.
వచ్చే వారం దర్యాప్తునకు హాజరు కావాలని తెలిపింది. అయితే, ఈ మెయిల్‌పై స్పందించిన నీరవ్ మోదీ... తాను విదేశాల్లో చాలా వ్యాపారాలతో చాలా బిజీగా ఉన్నానని, రాలేనని బదులిచ్చాడు. కాగా, ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు.. పన్ను చెల్లించాలని ఆదేశిస్తూ నీరవ్ మోదీతో పాటు అతని మేనమామ చౌక్సీకి చెందిన వ్యాపార సంస్థలకు కూడా నోటీసులు జారీ చేశారు.