ben stoks: పునరాగమనాన్ని ఘనంగా చాటిన ఇంగ్లండ్ క్రికెటర్ స్టోక్స్

  • దాడి ఘటన నేపథ్యంలో ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న బెన్ స్టోక్స్
  • న్యూజిలాండ్ సిరీస్ లో రెండో వన్డేతో జట్టులో చేరిన స్టోక్స్
  • రెండు వికెట్లు తీసి, 63 పరుగులు చేసిన స్టోక్స్

 ఐదు నెలల నిషేధం తరువాత ఇంగ్లండ్ జట్టులోకి వచ్చిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించి, జట్టు విజయంలో కీలకమయ్యాడు. బెన్ స్టోక్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఐదు వన్డేల సిరీస్‌ లో ఇంగ్లాండ్‌ పుంజుకుని, 1-1 విజయంతో లెక్కలు సరిచేసింది.

రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 49.4 ఓవర్లలో ‌ఓపెనర్ గప్తిల్‌ (50), శాంట్నర్‌ (63), గ్రాండ్‌ హోమ్‌ (38) ఆకట్టుకునే ప్రదర్శనతో 223 పరుగులకు ఆలౌట్ అయింది. బౌలర్లలో స్టోక్స్‌, మొయిన్‌ అలీ, వోక్స్‌ చెరి రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. నలుగురు కివీస్ బ్యాట్స్ మన్ రనౌట్ కావడం వారి కొంపముంచింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు ఆరంభంలో తడబడినా... కెప్టెన్ మోర్గాన్‌ (62) స్టోక్స్‌ (63 ) రాణించడంతో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా బెన్ స్టోక్స్ నిలిచాడు. 

  • Loading...

More Telugu News