stock markets: ఇన్వెస్టర్లకు ఫెడ్ భయం.. చతికిలపడ్డ మార్కెట్లు

  • వడ్డీ రేట్లను పెంచుతామంటూ ఫెడ్ సంకేతాలు
  • దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్
  • వరుసగా మూడోరోజూ నష్టపోయిన మార్కెట్లు

వడ్డీ రేట్లను పెంచుతామంటూ అమెరికా ఫెడ్ సంకేతాలను ఇవ్వడంతో... ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో, వరుసగా మూడో రోజు కూడా మార్కెట్లు నష్టాల బాటలో పయనించాయి. ఈనాటి ట్రేడింగ్ లాభాలతోనే ఆరంభమయినప్పటికీ... ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు క్రమంగా రెడ్ మార్క్ లోకి జారుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 137 పాయింట్లు నష్టపోయి 34,047 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 35 పాయింట్లు కోల్పోయి 10,458 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐనాక్స్ విండ్ లిమిటెడ్ (9.55%), ఐడీబీఐ బ్యాంక్ (7.64%), ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (5.81%), థర్మాక్స్ (4.69%), దాల్మియా భారత్ లిమిటెడ్ (4.68%).      

టాప్ లూజర్స్:
రెయిన్ ఇండస్ట్రీస్ (-4.99%), వక్రాంగీ (-4.97%), జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (-4.96%), రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (-4.70%), ఇండియన్ బ్యాంక్ (-4.15%).

  • Loading...

More Telugu News