Chandrababu: తదుపరి ఎలా? ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ!

  • నేడు అమరావతిలో ఎంపీలతో చంద్రబాబు సమావేశం
  • మరో మూడు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు
  • పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదుకోకుంటే కేంద్రంపై పోరుబాటనే అవలంబిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తదుపరి నరేంద్ర మోదీ సర్కారుపై ఏ విధంగా ఒత్తిడిని పెంచాలన్న విషయాన్ని చర్చించేందుకు నేడు ఎంపీలతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. మరో మూడు రోజుల్లో పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో, ఈ సమావేశాలు ముగిసేలోగానే రాష్ట్రానికి సాధ్యమైనంత సాయాన్ని కేంద్రం నుంచి రాబట్టడమే లక్ష్యంగా తన పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వైఖరిని, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహాలకు పదును పెట్టనున్నారు. ఇప్పటికే అమరావతి చేరుకున్న ఎంపీలు, చంద్రబాబుతో భేటీ అనంతరం రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారని తెలుస్తోంది.

కాగా, విభజన హామీలపై ముందడుగు వేయకుంటే బీజేపీతో పొత్తుకు కటీఫ్ చెప్పేంతటి తీవ్రమైన నిర్ణయాలను టీడీపీ అధినేత తీసుకుంటారా? అన్న విషయమై చర్చ సాగుతోంది. ఇదే సమయంలో రేపు బీజేపీ నేతలు కూడా ఇదే విధమైన సమావేశాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం. ఇప్పటికే టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు హద్దులను దాటిన నేపథ్యంలో ఈ రెండు సమావేశాల్లో ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయన్న ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News