Kaala: 'కాలా' తెలుగు టీజర్... రజనీ పవర్ ఫుల్ డైలాగులివి!
- తెలుగు టీజర్ విడుదల
- నలుపు శ్రమజీవుల వర్ణమంటున్న రజనీ
- పూర్తి రౌడీయిజాన్ని చూపిస్తానని హెచ్చరిక
- అలరిస్తున్న టీజర్
తెలుగు రాష్ట్రాల్లోని రజనీకాంత్ అభిమానుల కోసం 'కాలా' తెలుగు టీజర్ కూడా వచ్చేసింది. "కాలా అంటే ఎవరు? కాలుడు... కరికాలుడు. గొడవపడైనా సరే కాపాడేవాడు" అన్న బ్యాక్ గ్రౌండ్ వాయిస్ డైలాగుతో పాటు ఓ మధ్యతరగతి కుటుంబ గృహిణి "గొడవేకదా? పెట్టుకుంటాడు పెట్టుకుంటాడు. ఎన్నాళ్లు ఎట్టుకుంటాడో నేనూ చూస్తా" అని వ్యంగ్యంగా అనే మాటలతో రజనీ స్వభావాన్ని చూపించే ప్రయత్నం చేశారు.
ఆపై నానాపటేకర్ డైలాగులతో పాటు "నలుపు... శ్రమ జీవుల వర్ణం. మా వాడకొచ్చి చూడు. మురికంతా ఇంధ్రదనస్సులా కనిపిస్తుంది", "క్యారే... సెట్టింగా? వీరయ్య బిడ్డనురా... ఒక్కడినే ఉన్నా... దిల్లుంటే గుంపుగా రండిరా" అన్న రజనీ డైలాగ్ ఈ టీజర్ లో ఉన్నాయి. చివరిగా "ఈ కరికాలుడి పూర్తి రౌడీయిజాన్ని చూడలేదు కదూ. ఇప్పుడు చూపిస్తా" అన్న డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. తెలుగు 'కాలా' టీజర్ ను మీరూ చూడండి.