tammareddy: సర్వీస్ చార్జీల పేరిట ప్రొవైడర్లు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ
- యాడ్స్ రూపంలో దోచుకుంటున్నారు
- ఈ విషయాలన్నింటిపైనా నిర్మాతల మండలి మాట్లాడాలి
- చిత్ర పరిశ్రమకు భారంగా ఉన్న జీఎస్టీ పైనా చర్చించాలని తమ్మారెడ్డి విజ్ఞప్తి
దక్షిణాది రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ పై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. సర్వీస్ చార్జీల పేరిట ప్రొవైడర్లు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని, యాడ్స్ రూపంలో దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం బంద్ జరుగుతోంది కనుక ఈ విషయాలన్నింటిపైనా నిర్మాతల మండలి మాట్లాడితే బాగుంటుందని తన అభిప్రాయమని చెప్పారు. చిత్ర పరిశ్రమకు భారంగా ఉన్న జీఎస్టీ పైనా చర్చించాలని ఈ సందర్భంగా తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.