BJP: త్రిపురలో గెలిచాం.. కర్ణాటకలో భారీ విజయం సాధించేందుకు ముందుకు వెళుతున్నాం: అమిత్‌ షా

  • ఈ విజయం కార్యకర్తల విజయం
  • ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయం నవశకానికి నాంది 
  • కార్యకర్తలకు అభినందనలు
  • త్రిపురలో 2013లో 1.3 శాతం ఓట్లు.. ఈ రోజు 45 స్థానాల్లో గెలుపు

ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో త్రిపురలో భారతీయ జనతా పార్టీ 36 స్థానాల్లో విజయం సాధించి, 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీపీఎం కూటమి మాత్రం 11 స్థానాల్లో మాత్రమే గెలిచి మరో 4 నియోజక వర్గాల్లో లీడ్‌లో ఉంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయాన్ని కార్యకర్తల విజయంగా అభివర్ణించారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయం నవశకానికి నాంది అని అన్నారు.

మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల కార్యకర్తలకు అభినందనలు తెలుపుతున్నట్లు అమిత్‌ షా పేర్కొన్నారు. త్రిపురలో 2013లో తమకు 1.3 శాతం ఓట్లు మాత్రమే లభించాయని అన్నారు. ఈ రోజు అదే రాష్ట్రంలో 45 స్థానాల్లో గెలుస్తున్నామని చెప్పారు. ఇదే ఉత్సాహంతో త్వరలో జరగబోయే కర్ణాటకలోనూ భారీ విజయం సాధించేందుకు ముందుకెళుతున్నామని అన్నారు.    

  • Loading...

More Telugu News