Donald Trump: హత్య చేస్తారన్న భయంతో గొడ్డు మాంసాన్ని మానేసిన ట్రంప్!
- తినే ఆహారంలో విషం కలుపుతారేమోనన్న ఆందోళనలో ట్రంప్
- 'ఫైర్ అండ్ ప్యూరీ'లో వెల్లడించిన యూఎస్ జర్నలిస్ట్
- ఫిజీషియన్ రోనీ జాక్సన్ హెచ్చరికల కారణంగానేనంటున్న అధికారులు
- మొత్తానికి గొడ్డుమాంసం తినడాన్ని ఆపిన ట్రంప్
హంబర్గర్... సన్నగా ఉన్న మంటపై ఉడికించిన గొడ్డుమాంసం ముక్కలను బ్రెడ్ మధ్యలో ఉంచి, ఆయిల్ వేస్తూ, కాస్తంత సాస్, చీజ్, ఆనియన్స్ జత చేసి తయారు చేసే రుచికరమైన వంటకం. ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చైన్ రెస్టారెంట్ మెక్ డొనాల్డ్స్ ఈ వంటకానికి బిగ్ మాక్ హాంబర్గర్ అని పేరు పెడితే, అది వరల్డ్ ఫేమస్ అయిపోయింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ మాక్ అంటే ఎంతో ఇష్టం.
అయితే, ఇప్పుడాయన దాన్ని తినడం మానేశారు. ఎందుకో తెలుసా? విషప్రయోగం చేస్తారేమోనన్న భయం. పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, స్వల్ప కాలంలోనే తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆకాశానికి చేర్చిన ఆయన, ఇప్పుడు అమెరికాకు ప్రధమ పౌరుడు. ఇప్పుడాయన గొడ్డుమాంసాన్ని మానేశారని ప్రముఖ అమెరికన్ జర్నలిస్ట్ మిచెల్ వూల్ఫ్ తాను రాసిన తాజా పుస్తకం 'ఫైర్ అండ్ ప్యూరీ'లో వెల్లడించారు.
ఎవరైనా గిట్టనివారు తాను తినే ఆహారంలో విషం కలపవచ్చన్న ఆందోళనే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా, 6.3 అడుగుల ఎత్తు, 108 కిలోల బరువున్న ఆయన ఒబేసిటీకి దగ్గరగా ఉన్నారని, డైట్ పాటించకుంటే కష్టమని శ్వేతసౌధం ఫిజీషియన్ డాక్టర్ రోనీ జాక్సన్ హెచ్చరించిన కారణంగా కూడా ఆయన గొడ్డుమాంసాన్ని మానేశారని మరికొందరు అంటున్నారు.