oscar awards: ఈ ఏటి ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే... అవార్డులను కొల్లగొట్టిన 'ది షేప్ ఆఫ్ వాటర్'!
- ఉత్తమ చిత్రంగా ది షేప్ ఆప్ వాటర్
- ఉత్తమ నటి ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్
- ఉత్తమ నటుడుగా గ్యారీ ఓల్డ్ మ్యాన్
- ఉత్తమ దర్శకుడిగా గులెర్మో డెల్ టోరో
సినిమా రంగానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డుగా పరిగణించే ఆస్కార్ విజేతల జాబితా నేడు విడుదలైంది. ఉత్తమ చిత్రంగా 'ది షేప్ ఆఫ్ వాటర్' నిలిచింది. అంతేకాదు ఇదే చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు అందించిన గులెర్మో డెల్ టోరోను ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ జ్యూరీ ఎంపిక చేసింది. ఈ చిత్రాన్ని మరో రెండు అడార్డులు కూడా వరించాయి. ఈ ఏడాదికి సంబంధించి ఆస్కార్ అవార్డుల విజేతల వివరాలు ఇలా ఉన్నాయి...
ఉత్తమ చిత్రం: ది షేప్ ఆఫ్ వాటర్
ఉత్తమ దర్శకుడు: గులెర్మో డెల్ టోరో (ది షేప్ ఆఫ్ వాటర్ దర్శకుడు)
ఉత్తమ నటి: ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్ (త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి సినిమాకు గాను)
ఉత్తమ నటుడు: గ్యారీ ఓల్డ్ మ్యాన్ (డార్కెస్ట్ అవర్ చిత్రానికి)
ఉత్తమ సహాయ నటి: అల్లిసన్ జానే (ఐ, టోన్యా చిత్రానికి)
ఉత్తమ సహాయ నటుడు: శామ్ రాక్ వెల్ (త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి సినిమాకు గాను)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: గెట్ అవుట్
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కాల్ మి బై యువర్ నేమ్ చిత్రం
ఉత్తమ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్: కోకో
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ఏ ఫాంటాస్టిక్ ఉమన్, చిలీ
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: ది షేప్ ఆఫ్ వాటర్
ఉత్తమ ఒరిజినల్ గీతం: రిమెంబర్ మి (కోకో సినిమా)
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: ఐకారస్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: హెవెన్ ఈజ్ ఏ ట్రాఫిక్ జామ్ ఆన్ ద 405
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్: ది సైలెంట్ చైల్డ్
ఉత్తమ యానిమేషన్ షార్ట్: డియర్ బాస్కెట్ బాల్
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: డన్ కిర్క్
ఉత్తమ సౌండ్ మిక్సింగ్: డన్ కిర్క్
ఉత్తమ నిర్మాణ డిజైన్: ది షేప్ ఆఫ్ వాటర్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: బ్లేడ్ రన్నర్
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్: డార్కెస్ట్ అవర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫాంటమ్ థ్రెడ్
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: డన్ కిర్క్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: బ్లేడ్ రన్నర్