ntr: నాడు ఎన్టీఆర్ .. నేడు కేసీఆర్ : ఉపముఖ్యమంత్రి కడియం

  • ఢిల్లీలో తెలుగువాణిని నాడు ఎన్టీఆర్ ఎలుగెత్తి చాటారు
  • అదేపని, నేడు కేసీఆర్ చేయబోతున్నారు
  • థర్ఢ్ ఫ్రంట్ కు నాయకత్వం వహించే సత్తా కేసీఆర్ కే ఉంది
  • ఏపీకి ప్రత్యేకహోదాను థర్డ్ ఫ్రంట్ తో సాధించుకోవచ్చు : కడియం

ఢిల్లీలో తెలుగువాణిని నాడు ఎన్టీఆర్ ఎలుగెత్తి చాటారని, అదేపని నేడు కేసీఆర్ చేయబోతున్నారని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో మంత్రి చందూలాల్ తో కలిసి సర్క్యూట్ హౌస్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. థర్ఢ్ ఫ్రంట్ కు నాయకత్వం వహించే సత్తా కేసీఆర్ కే ఉందని, తెలుగు ప్రజలందరూ ఆయనకు మద్దతుగా నిలవాలని కోరారు. ఏపీపై ఒక రకమైన వివక్ష, తెలంగాణపై మరోరకమైన వివక్షను కేంద్ర ప్రభుత్వం చూపుతోందని, ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నా కేంద్రం సహకరించని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేకహోదాను థర్డ్ ఫ్రంట్ ద్వారా సాధించుకోవచ్చని దీనికి చంద్రబాబునాయుడు మద్దతు ఇవ్వాలని కోరారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విఫలం

ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని కడియం విమర్శించారు. గ్రామీణాభివృద్ధిని, పేదల సంక్షేమాన్ని బీజేపీ గాలికొదిలేసిందని, ప్రజా సమస్యలపై, వ్యవస్థలో లోపాలను సరిదిద్దడంపై మోదీ దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. నాడు కాంగ్రెస్ హయాం అవినీతి, అక్రమాల మయమని అన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితులు పోయి ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో థర్డ్ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వామపక్ష పార్టీలు సైతం తమ అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి థర్డ్ ఫ్రంట్ తో కలసివస్తే బాగుంటుందని కడియం అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News