KCR: కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్‌పై ప్రొ.కోదండరామ్ స్పందన

  • వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో కోదండరామ్ మీడియా సమావేశం 
  • ఇప్పటివరకు టీఆర్ఎస్ తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏంటి?
  • మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ అనడమేంటి?
  • నెల రోజుల్లో పూర్తి విధివిధానాలతో ఐకాస పార్టీ ఏర్పాటు

మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడమేంటని రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొ. కోదండరామ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర రాజకీయాలంటూ కేసీఆర్ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో కోదండరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నాలుగేళ్లుగా కేసీఆర్ రైతులకు ఏమీ చేయలేదని అన్నారు.

తెలంగాణలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులను కమీషన్ కోసమే చేస్తున్నారని, వాటిపై విచారణకు ఆదేశించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటని నిలదీశారు. కాగా, నెల రోజుల్లో పూర్తి విధివిధానాలతో ఐకాస పార్టీ ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల నుంచే తమ పార్టీ అజెండా ఉంటుందని తెలిపారు. ఈ నెల 10న తాము హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ స్మృతి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. 

  • Loading...

More Telugu News