girl: కొడవలి పట్టుకుని నడిరోడ్డుపైకి దూసుకొచ్చి.. యువకుడిని వెంబడించిన అమ్మాయి
- గుజరాత్ లోని సూరత్ లో ఘటన
- రౌడీషీటర్ తో ప్రేమలో ఉన్న 20 ఏళ్ల అస్మిత
- తన ప్రియుడితో గొడవ పెట్టుకున్నాడని యువకుడి వెంటపడ్డ వైనం
ఓ అమ్మాయి నడిరోడ్డుపై రౌడీలా ప్రవర్తించిన ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటు చేసుకుంది. ఓ కొడవలిని చేతిలో పట్టుకుని ఆమె ఒక యువకుడిపై దాడి చేయబోగా తీసిన వీడియో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే, అస్మితా గోహిల్ అనే 20 ఏళ్ల అమ్మాయి.. సంజయ్ అలియాస్ భూరో అనే ఓ రౌడీ షీటర్ తో ప్రేమాయణం కొనసాగిస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆమెను హెచ్చరించడంతో ఆమె ఇంట్లోంచి వచ్చేసి సంజయ్ అలియాస్ వద్దే ఉంటోంది. కాగా, ఇటీవల తన ప్రియుడితో ఓ వ్యక్తి గొడవ పెట్టుకోగా అతడిని అస్మితా కొడవలితో వెంటాడింది. ఆ వ్యక్తి పారిపోతుండగా సంజయ్ అలియాస్, అస్మితా పట్టుకుని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం, అస్మిత, ఆమె ప్రియుడు పరారీలో ఉన్నారు.