allu aravind: అల్లు అరవింద్, సురేశ్ బాబులపై నట్టి కుమార్ ఆగ్రహం

  • స్వార్ధ ప్రయోజనాల కోసం బంద్ జరిగింది
  • కేవలం రెండు వేల రూపాయల కోసం 6 రోజులు థియేటర్లు మూసేయించారు
  • 6 రోజుల నష్టాన్ని ఎవరు భరిస్తారు?

చిత్రపరిశ్రమలోని కొంత మంది బడా నిర్మాతల స్వార్థ ప్రయోజనాల కోసమే థియేటర్ల బంద్ జరిగిందని నిర్మాత నట్టి కుమార్ విమర్శించారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు అధిక రేటు వసూలు చేస్తున్నారంటూ చేసిన బంద్ సినీ పరిశ్రమ మేలు కోసం చేసింది కాదని ఆయన స్పష్టం చేశారు. చిన్న సమస్య కోసం ఆరురోజులు బంద్ చేయడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆరురోజుల బంద్ వల్ల చిన్న నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు ఏర్పడిన కోట్ల రూపాయలు నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, యూఎఫ్ఓ సంస్థల వెనుక సురేశ్‌ బాబు, అల్లు అరవింద్‌ వంటి నిర్మాతలు ఉండడం వల్లే ఇలా జరిగిందని ఆయన ఆరోపించారు. బంద్ కు ముందు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు 12 వేల రూపాయల ఫీజు వసూలు చేసేవారని, పది వేల రూపాయలు వసూలు చేయాలంటూ ఆరురోజులు థియేటర్లు బంద్ చేశారని ఆయన తెలిపారు. రెండు వేలు కాకుండా పది వేలు తగ్గించాలని బంద్ చేసి ఉంటే ఒకలా ఉండేదని, కేవలం రెండు వేల కోసం ఆరు రోజుల పాటు థియేటర్లు మూసేయించారని ఆయన విమర్శించారు. 

  • Loading...

More Telugu News