Kamal Haasan: నేను గొప్ప వ్యక్తినేం కాదు: కమలహాసన్‌

  • సమాజంలో మార్పు సాధారణ ప్రజలతోనే సాధ్యం
  • నన్ను నేను ప్రేమిస్తా, విమర్శించుకుంటా
  • యువ‌కులు‌ నా పార్టీలో చేర‌డమనేది రెండో ఆప్షన్
  • మొద‌ట అంద‌రూ ఓటు వేయాలి

సమాజంలో మార్పు సాధారణ ప్రజలతోనే సాధ్యమవుతుందని సినీన‌టుడు క‌మ‌లహాస‌న్ అన్నారు. ఆయ‌న‌ ఇటీవ‌లే ‘మక్కల్‌ నీది మయ్యం’ పేరిట‌ రాజ‌కీయ పార్టీ ప్రారంభించి, త‌న సిద్ధాంతాల‌ను ప్ర‌క‌టించిన‌ విష‌యం తెలిసిందే. చెన్నైలోని ఓ క‌ళాశాల‌లో ఈ రోజు నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజ‌రైన క‌మ‌లహాస‌న్... విద్యార్థులతో ముఖాముఖి నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా క‌మ‌లహాస‌న్ మాట్లాడుతూ... తాను నటుడిగా కాకుండా, ప్ర‌జ‌ల సేవకుడిగానే చనిపోతానని చెప్పుకొచ్చారు. తాను గొప్ప వ్యక్తినేం కాద‌ని, త‌న‌ను తాను ప్రేమిస్తానని, అలాగే విమర్శించుకుంటానని అన్నారు. యువ‌కులు త‌న పార్టీలో చేర‌డమనేది రెండో ఆప్షనని, మొద‌ట అంద‌రూ ఓటు వేయాల‌ని కమల హాసన్ అన్నారు.

త‌న పార్టీలో యువతకు అవకాశాలు క‌ల్పిస్తామ‌ని, బాధ్యతలేని స్వేచ్ఛ అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాగా, క‌మ‌లహాస‌న్ త‌న పార్టీ స‌భ్య‌త్వాల కోసం ఇప్ప‌టికే వెబ్ సైట్, యాప్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News