kambhampati haribabu: జైట్లీ మాటలను టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారు: కంభంపాటి హరిబాబు

  • ఏపీకి కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం లేదని ఆరోపిస్తున్నారు
  • ఏపీకి ప్రత్యేక హోదాతో సమాన ప్రయోజనాలు కల్పిస్తున్నారు
  • హోదాతో 90:10 నిష్పత్తిలో నిధులు వస్తాయి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా కోసం డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ సాయం మాత్రమే చేస్తామని మరోసారి పాత పాటే పాడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నేతలు మండిపడుతోన్న నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు స్పందిస్తూ... జైట్లీ మాటలను వక్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తుండడం విచారకరమని అన్నారు.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాతో సమాన ప్రయోజనాలు కల్పిస్తోందని తెలిపారు. ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామాలు చేస్తోన్న నేపథ్యంలోనే రాష్ట్రంలో తమ నేతలు మంత్రి పదవులకి రాజీనామాలు చేసినట్లు చెప్పారు. హోదాతో 90:10 నిష్పత్తిలో నిధులు మాత్రమే వస్తాయని, ఆ ప్రయోజనాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉందని జైట్లీ తెలిపారని అన్నారు.


  • Loading...

More Telugu News