mohan babu: మోహన్‌బాబు, విష్ణులపై టీచర్ ఫిర్యాదు.. పోలీసు కేసు నమోదు

  • డ్రెస్ కోడ్ సరిగా లేదంటూ ఇంగ్లీష్ టీచర్ ను మందలించిన యాజమాన్యం
  • కేసు పెట్టిన టీచర్ బ్యూలా
  • ఇరు వర్గాలపై కేసులు నమోదు

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు, సినీ హీరో మంచు విష్ణులపై పోలీసు కేసు నమోదైంది. వీరితో పాటు మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ లో పని చేస్తున్న మరో ఐదుగురిపై కూడా కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.... తిరుపతి సమీపంలో ఉన్న శ్రీవిద్యానికేతన్ లో బ్యూలా అనే మహిళ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలిగా పని చేశారు. నవంబర్ 28వ తేదీన అక్కడ జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె సివిల్ డ్రస్ లో హాజరయ్యారు. ఆమె డ్రెస్ కోడ్ సరిగా లేదని కళాశాల యాజమాన్యం ఆమెను అందరి ముందు మందలించింది. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తతో కలసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో మోహన్ బాబు, విష్ణు, విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ కైరనే ఎగునే రిజెన్సీ, అసిస్టెంట్ హెచ్ఆర్ మేనేజర్ జీవరాజగోపాల్, సీఏవో తులసి నాయుడు, వైస్ ప్రిన్సిపాళ్లు కిన్షుక్ భట్టాచార్య, గ్లోరిదెవ్ ప్రియలపై సెక్షన్ 505, 508 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రెస్ కోడ్ సరిగా లేకపోవడం, క్లాసులకు సరిగా హాజరుకాకపోవడంతోనే ఆమెను మందలించినట్టు తెలిపారు. సర్టిఫికెట్లతో పాటు రావాల్సిన సొమ్మును తీసుకెళ్లాలని సమాచారం పంపామని, అయినా ఆమె రాలేదని చెప్పారు. లాయర్ ద్వారా నోటీసు పంపారని తెలిపారు. రు. 5 లక్షలు ఇస్తే కోర్టు నోటీసును వెనక్కి తీసుకుంటానని చెప్పారని వెల్లడించారు.

మరోవైపు, బ్యూలాపై కూడా శ్రీవిద్యానికేతన్ యాజమాన్యం కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో, ఆమెపై కూడా 308, 511 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సురేష్ తెలిపారు.

  • Loading...

More Telugu News