Sri Lanka: శ్రీలంక క్రికెటర్ రమిత్ అరెస్ట్

  • ఇద్దరు యూనివర్శిటీ విద్యార్థులపై రమిత్ దాడి
  • డ్రంకెన్ డ్రైవ్ కూడా
  • ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు

శ్రీలంక క్రికెటర్ రమిత్ రామ్ బుక్వెల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మందు తాగి కారు నడపడమే కాకుండా, ఇద్దరు యూనివర్శిటీ విద్యార్థులపై దాడికి పాల్పడిన కారణాలతో అతన్ని అరెస్ట్ చేశారు. విద్యార్థులపై దాడి అనంతరం కొలంబోలోని నవాలా హైవేపై వెళుతున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. రమిత్ ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ధ్రువీకరించారు. అతన్ని అలుత్ కేడ్ మేజిస్ట్రేజ్ కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిపారు.

మరోవైపు, రజిత్ పై శ్రీలంక క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డుకు సంబంధించిన ఓ అధికారి హెచ్చరించారు. రెండేళ్ల క్రితం కూడా రజిత్ డ్రంకన్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. తాజా పరిణామాలతో, శ్రీలంక క్రికెట్ కాంట్రాక్టును అతను కోల్పోయే పరిస్థితి నెలకొంది. 2013లో శ్రీలంక జాతీయ జట్టులోకి రమిత్ వచ్చాడు. 2016 జూలైలో చివరి మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు శ్రీలంక తరపున రెండు టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు.

  • Loading...

More Telugu News