Afghanistan: ఆఫ్ఘాన్‌లో విరుచుకుపడిన తాలిబన్లు.. 24 మంది సైనికులు మృతి
- సైనికులపై ఒక్కసారిగా విరుచుకుపడిన తాలిబన్లు
- 53 మందిని చంపేశామని ప్రకటన
- ఓపియమ్ పంటకు ఫరా ప్రసిద్ధి
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మరోమారు విరుచుకుపడ్డారు. దేశ పశ్చిమ ప్రాంతంలోని ఫరా కనుమల్లోని బలాబులక్ జిల్లాలో తాలిబన్లు జరిపిన దాడిలో ఇప్పటి వరకు 24 మంది సైనికులు మృతి చెందారు. ఇక్కడ నల్లమందు భారీగా పండిస్తున్న ప్రాంతాలపై దాడి చేసేందుకు సిద్ధమైన జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 22 మంది భద్రతా సిబ్బంది, ప్రత్యేక దళాలకు చెందిన మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. తాలిబన్ల దాడిలో 24 మంది సైనికులు మృతి చెందినట్టు సైనిక ప్రతినిధి పేర్కొనగా, 53 మంది సైనికులను హతమార్చినట్టు తాలిబన్ పేర్కొంది. ప్రస్తుతం దాడి జరిగిన ప్రదేశాన్ని ఉగ్రవాదులు తరచూ టార్గెట్ చేస్తున్నారు. ఇరాన్ సరిహద్దులో ఉన్న ఫరాలో ఓపియమ్‌ను విస్తృతంగా పండిస్తుంటారు.