Azam Khan: జయప్రదపై ఆజాంఖాన్ తీవ్ర పదజాలం...వీడియో వైరల్

  • పద్మావత్ చిత్రంలో ఖిల్జీ పాత్ర చాలా చెడ్డదని విన్నానని వ్యాఖ్య
  • ఖిల్జీ రాక ముందే పద్మావత్ స్వర్గసీమకు పారిపోయిందంటూ సెటైర్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఎస్‌పీ నేత వీడియో

తనను పద్మావత్ చిత్రంలోని ఖిల్జీ పాత్రతో పోల్చిన నటి జయప్రదకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) సీనియర్ నేత ఆజాంఖాన్‌ చురకలు అంటించారు. "ఇటీవల ఓ మహిళ, ఓ నర్తకి ఈ సేవకుడి గురించి ఏవో వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి నర్తకిలు, గాయనులతో గొడవపడుతుంటే నేనెప్పుడు రాజకీయాలు చేయాలి..మీరే చెప్పండి?" అంటూ ఆజాం ఖాన్ తన మద్దతుదారుల సమక్షంలో జయప్రదపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. "పద్మావత్ చిత్రాన్ని తెరకెక్కించారు. అందులో ఖిల్జీ పాత్ర చాలా దుర్మార్గంగా ఉందని విన్నాను. ఖిల్జీ రాక ముందే పద్మావత్ స్వర్గసీమకు పలాయనం చిత్తగించిందని విన్నాను" అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‍గా మారింది. కాగా, 2009 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆజాం ఖాన్ తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేశారని జయప్రద చేసిన ఆరోపణలకు ఆజాం ఖాన్ ఈ విధంగా ప్రతివ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
<blockquote class="twitter-video" data-lang="en"><p lang="en" dir="ltr">Shocking Remark: Senior Samajwadi Party leader Azam Khan describes Jaya Prada as "Naachne Wali", says "Naachne Wali ke main muh ni lagta"! So much for women empowerment, you see! <a href="https://twitter.com/Uppolice?ref_src=twsrc%5Etfw">@Uppolice</a> can we expect some action from you? <a href="https://t.co/gzbc6Y7HW9">pic.twitter.com/gzbc6Y7HW9</a></p>— Prashant Kumar (@scribe_prashant) <a href="https://twitter.com/scribe_prashant/status/972649597616164864?ref_src=twsrc%5Etfw">March 11, 2018</a></blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>


  • Loading...

More Telugu News