Telugudesam: భూమా నాగిరెడ్డి వర్థంతి..అఖిలప్రియ భావోద్వేగం!

  • నా తల్లిదండ్రులు నన్ను ఏనాడూ ఏడిపించలేదు
  • నంద్యాల ఉపఎన్నికల సమయంలో మాత్రం కొందరు నన్ను ఏడిపించే ప్రయత్నం చేశారు
  • నా తండ్రి ఆశయాలను కొనసాగిస్తాం : అఖిలప్రియ

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి ప్రథమ వర్థంతి సభ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తల్లిదండ్రులు భూమానాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిని గుర్తుచేసుకున్న మంత్రి అఖిలప్రియ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులు తనను ఏనాడూ ఏడిపించలేదని, నంద్యాల ఉపఎన్నికల సమయంలో మాత్రం కొందరు తనను ఏడిపించే ప్రయత్నం చేశారని వాపోయారు. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా అఖిలప్రియ అన్నారు. కాగా, ఈ వర్థంతి కార్యక్రమంలో మంత్రులు ఆదినారాయణ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు.

@
  • Loading...

More Telugu News