Shami: సాక్ష్యాలు దొరక్కుంటే దయనీయురాలినై పోయేదాన్ని... ఇక రాజీ కష్టమే: క్రికెటర్ షమీ భార్య హసీన్ జహాన్
- ఇప్పటికే భర్తపై పలు రకాల ఆరోపణలు చేసిన జహాన్
- అతని సెల్ ఫోన్ దొరకబట్టే సాక్ష్యాలు సంపాదించా
- ఇక రాజీ ప్రసక్తే లేదు: మీడియాతో జహాన్
గృహ హింస నుంచి లైంగిక దాడి, అత్యాచారయత్నం వంటి ఎన్నో ఆరోపణలను భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీపై చేసిన ఆయన భార్య హాసీన్ జహాన్ తన ఆరోపణల దాడిని మరింతగా పెంచింది. అతను చేసిన పనులకు, అన్యాయానికి సంబంధించిన ఆధారాలు తనకు దొరక్కుండా ఉండివుంటే తన పరిస్థితి దయనీయమై పోయుండేదని వ్యాఖ్యానించింది. ఎన్నో దేశాల్లోని అమ్మాయిలతో అతనికి సంబంధాలున్నాయని, షమీ మొబైల్ తన చేతికి దొరికిన తరువాత తానిలా మాట్లాడ గలుగుతున్నానని కోల్ కతాలో మీడియాకు వెల్లడించింది జహాన్.
ఆ మొబైల్ తనకు చిక్కకుండా ఉండుంటే, షమీ యూపీకి పారిపోయి, తనతో విడాకుల కోసం దరఖాస్తు చేసుండేవాడని ఆరోపించింది. నాలుగేళ్లుగా సర్దుకు పోవాలని చూస్తూనే ఉన్నానని, ఇప్పుడిక రాజీ ప్రసక్తే లేదని, ఆ దశ ఎప్పుడో దాటి పోయిందని వ్యాఖ్యానించింది. కాగా, జహాన్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు షమీ కుటుంబీకులు నలుగురు కోల్ కతా రాగా, వారిని కలిసేందుకు ఆమె నిరాకరించినట్టు తెలిసింది. తన కుమార్తె ఓ సెలబ్రిటీతో న్యాయ పోరాటానికి దిగినందున ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని, పోలీసు రక్షణ కల్పించాలని హసీన్ జహాన్ తండ్రి కోరాడు.