Chandrababu: అవసరమైతే త్యాగాలకు సిద్ధపడతాం: చంద్రబాబు

  • ఏపీ శాసనసభ స్థానాల సంఖ్యను పెంచుతామని చెప్పారు
  • ఇప్పుడు ఆ హామీని కూడా పట్టించుకోవడం లేదు
  • కడపలో ఉక్కు కర్మాగారం ఇంకా కేటాయించలేదు
  • రాష్ట్రానికి కియా మోటార్స్ రావడానికి చాలా కృషి చేశాం

కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ రోజు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రానికి పోలీసు అకాడమీ, సీసీఎంబీ వంటి సంస్థలు, పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వరని చంద్రబాబు ప్రశ్నించారు. భారత్ లో ఆంధ్రప్రదేశ్ భాగం కాదా? అని అడిగారు. బలవంతంగా విభజన చేశాక ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వపై ఉందని, హేతుబద్ధత లేకుండా విభజన చేశారని అన్నారు.

ఏపీ శాసనసభ స్థానాల సంఖ్యను పెంచుతామని చెప్పి, ఇప్పుడు ఆ హామీని కూడా పట్టించుకోవడం లేదని చంద్రబాబు చెప్పారు. కడపలో ఉక్కు కర్మాగారం ఇంకా కేటాయించలేదని అన్నారు. రాష్ట్రంలో నాలుగు రైల్వే డివిజన్లు ఉన్నాయని, ఇంతవరకు విశాఖ పట్నం రైల్వే జోన్ ప్రకటించలేదని అన్నారు. తాము తెలుగు జాతికి అత్యుత్తమ నగరం నిర్మిస్తామని, రాష్ట్రానికి కియా మోటార్స్ రావడానికి చాలా కృషి చేశామని, అవసరమైతే త్యాగాలకు సిద్ధపడతామని చంద్రబాబు చెప్పారు.   

  • Loading...

More Telugu News