jayasudha: డైలాగ్స్ నచ్చకపోతే చెప్పేదానిని కాదు: జయసుధ
- కొన్ని అవకాశాలను తిరస్కరించాను
- కథకు .. పాత్రకు ప్రాధాన్యమిచ్చాను
- డైలాగ్స్ చీప్ గా లేకుండా చూసుకున్నాను
తెలుగు తెరపై నిన్నటి తరం కథానాయికల్లో జయసుధ స్థానం ప్రత్యేకమని చెప్పక తప్పదు. అగ్రకథానాయకులందరితో నటించి అనేక విజయాలను ఆమె సొంతం చేసుకున్నారు. అలాంటి జయసుధ తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. అనేక విషయాలను పంచుకున్నారు.
" కొన్ని అవకాశాలను నేను తిరస్కరించిన సందర్భాలు వున్నాయి. కథ నచ్చకపోయినా .. నా పాత్రను తీర్చిదిద్దిన విషయంలో సందేహం వచ్చినా ఆ సినిమా చేసేదానిని కాదు. ఇక నేను చెప్పే డైలాగ్స్ చీప్ గా అనిపించినా .. సరిగ్గా లేవని అనిపించినా ఆ డైలాగ్స్ చెప్పేదానిని కాదు. ఆ డైలాగ్స్ సహజత్వానికి దగ్గరగాలేకపోతే .. బయట ఇలా జరగదు కదా అనిపించినా ఆ డైలాగ్స్ చెప్పనని అనేదానిని. నాకు తెలుగు చదవడం .. రాయడం రాకపోయినా అలాంటి డైలాగ్స్ కరెక్ట్ చేసేదానిని" అంటూ చెప్పుకొచ్చారు.