VISHNU KUMAR RAJU: ప్రత్యేక హోదా వల్ల అన్ని రాయితీలు వస్తాయని కొందరు అనుకుంటున్నారు: విష్ణు కుమార్ రాజు

  • కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులు, పథకాలకు మాత్రమే 90 శాతం నిధులు వస్తాయి 
  • రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది
  • రెవెన్యూ లోటు రూ.4117 కోట్లని కేంద్ర ప్రభుత్వం తేల్చింది

హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. ఈ రోజు ఆయన శాసనసభలో మాట్లాడుతూ... 14వ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల అన్నింటికీ రాయితీలు వస్తాయని కొందరు అనుకుంటున్నారని, కానీ కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులు, పథకాలకు మాత్రమే 90 శాతం నిధులు వస్తాయని ఆయన అన్నారు.

ఏపీ రెవెన్యూలోటు గురించి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ... రుణమాఫీ, డిస్కంలు పింఛన్లకు సంబంధించిన నిధులను కూడా రెవెన్యూ లోటులో చేర్చారని, అన్నింటినీ కలిపి ఏపీ రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని విష్ణుకుమార్‌ రాజు ఆరోపించారు. అయితే, రెవెన్యూ లోటు రూ.4117 కోట్లని కేంద్ర ప్రభుత్వం తేల్చిందని అన్నారు.   

  • Loading...

More Telugu News