Chandrababu: ప్రత్యేక హోదా గురించి కేంద్ర సర్కారుపై విమర్శలు చేయకుండా నాపై చేస్తున్నారు: చంద్రబాబు

  • ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం
  • నరేంద్ర మోదీపై నమ్మకం ఉందని వైసీపీ నేతలు అన్నారు
  • మరి అవిశ్వాస తీర్మానం ఎందుకు?
  • టీడీపీ ఎంపీలు సంతకాలు చేయాలని ఎందుకు అడుగుతున్నారు?

పోలవరం ప్రాజెక్టులో వేల కోట్ల అక్రమాలు జరిగాయని సాక్షి పత్రికలో వార్తలు రాశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అసలు ఆ ప్రాజెక్టులో అవినీతి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. వారి ఉద్దేశం ఏంటని, ఈ ప్రాజెక్టు పూర్తికాకూడదా? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి జీవనాడి పోలవరం అని, ఇప్పటికే తాము పట్టిసీమ పూర్తి చేసి రాయలసీమలో కరవు లేకుండా చేస్తున్నామని, అదే విధంగా పోలవరం పూర్తి చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఇటువంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

ఈ రోజు చంద్రబాబు శాసనసభలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమని, వైసీపీ నేతలు మాత్రం కేంద్ర సర్కారుపై కాకుండా తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలు నరేంద్ర మోదీపై నమ్మకం ఉందని అన్నారని, మరి అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడుతున్నారని, దానికి టీడీపీ ఎంపీలు సంతకాలు చేయాలని ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. వైసీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏ1, ఏ2 ఆర్థిక నేరస్తులు కూడా ప్రధానమంత్రిని కలుస్తున్నారని విమర్శించారు. ఏ1, ఏ2లు దోచుకున్న డబ్బంతా రాష్ట్ర ప్రజలదని వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News