Andhra Pradesh: విభజన చట్టం, హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఏపీ శాసన సభలో తీర్మానం
- రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి
- రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వాలి
- ఉక్కు కర్మాగారం స్థాపించాలి
- ఓడరేవు రావాలి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలు, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ శాసనభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని, రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని అన్నారు.
తీర్మానంలో పేర్కొన్న అంశాలు..
- రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి
- రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వాలి
- ఉక్కు కర్మాగారం స్థాపించాలి
- ఓడరేవు రావాలి
- పెట్రో కెమికల్ పరిశ్రమ ఏర్పాటు కావాలి
- నియోజక వర్గాల సంఖ్య పెరగాలి
- విద్య, పరిశోధన సంస్థలు ప్రారంభించాలి
- ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన పూర్తి కావాలి