Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో బయటపడ్డ 6,000 కోట్ల కుంభకోణం

  • 6,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన ది ఇండియన్ టెక్నోమ్యాక్ కంపెనీ
  • 16 బ్యాంకులకు 6,000 కోట్ల బకాయిలు
  • ది ఇండియన్ టెక్నోమ్యాక్ కంపెనీ కుంభకోణం బయటపెట్టిన ఎక్సైజ్ శాఖ

హిమాచల్ ప్రదేశ్‌ లో మరో భారీ కుంభకోణం బయటపడింది. ది ఇండియన్ టెక్నోమ్యాక్ కంపెనీ 6000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ లో ది ఇండియన్‌ టెక్నోమాక్‌ కంపెనీ 2,175 కోట్ల రూపాయల పన్నుతో పాటు మరోక 2167 కోట్ల రూపాయల లోన్లను ఎగవేసిందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. దానితో పాటు మరో 20 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నాయని తెలిపింది. ఇలా మొత్తం 6,000 కోట్ల రూపాయలను వివిధ బ్యాంకులకు ఎగవేసినట్టు పేర్కొంటూ ఎక్సైజ్‌ శాఖ మజ్ర పోలీస్‌ స్టేషన్‌ లో సెక్షన్‌ 420, 487, 468, 470, 471ల కింద కంపెనీ ఛైర్మన్‌ రాకేష్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, రంజన్‌ మోహన్‌, అశ్విన్‌ సాహూలపై కేసులు నమోదు చేసింది. ఈ కంపెనీని 2009 కంటే ముందు స్థాపించినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. తప్పుడు పత్రాలతో సేల్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందింది చాలక, 2009 నుంచి 2014 వరకు సెల్స్ ట్యాక్స్ ఎగవేశారని ఆరోపించింది. దాదాపు 16 బ్యాంకుల నుంచి ఈ మొత్తం తీసుకుని ఎగనామం పెట్టిందని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.

  • Loading...

More Telugu News