Andhra Pradesh: మండే ఎండల నుంచి ఉపశమనం... 48 గంటల వర్షాలకు అవకాశం!
- అరేబియా సముద్రంలో అల్పపీడనం
- వాయుగుండంగా మారే అవకాశం
- రేపు, ఎల్లుండి వర్షాలకు చాన్స్
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి కాసింత ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి, అది వాయుగుండంగా మారుతుండటంతో రేపు, ఎల్లుండి తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించారు. మహారాష్ట్ర, కేరళ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు అధికంగా, వేసవి తాపాన్ని ఈ వర్షాలు కొంతమేరకు తగ్గిస్తాయని అంచనా.