ntr: ఎన్టీఆర్ ..చరణ్ లతో రాజమౌళి సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే!
- ఎన్టీఆర్ .. చరణ్ లతో మల్టీ స్టారర్
- దర్శకుడిగా రాజమౌళి
- అక్టోబర్లో సెట్స్ పైకి
ఎన్టీఆర్ .. చరణ్ .. ఈ ఇద్దరికీ కూడా యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ వుంది. ఇక దర్శకుడిగా రాజమౌళికి అన్నివర్గాల ప్రేక్షకుల్లోను ఎంతో ఇమేజ్ వుంది. అలాంటి ఈ ముగ్గురి కాంబినేషన్లో ఒక సినిమా సెట్ కావడమనేది అంత ఆషామాషీ విషయం కాదు. అలాంటిది ఈ ముగ్గురి కాంబినేషన్లో ఒక భారీ చిత్రాన్ని రూపొందించడానికి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి.
ఒక వైపున ప్రీ ప్రొడక్షన్ పనులు .. మరో వైపున ఇద్దరు హీరోలపై టెస్ట్ ఫోటో షూట్ లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ కలిసి నటించనుండటమే ఒక విశేషమైతే .. అన్నదమ్ములుగా నటించనుండటం మరో విశేషం. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను అక్టోబర్లో సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి .