shami: బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం విచారణలో.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన క్రికెటర్ షమీ
- మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ
- నాది తప్పు అని తేలితే నన్ను ఉరి తీయండి: షమీ
- బీసీసీఐ నా వార్షిక కాంట్రాక్టును రద్దు చేసింది
- కానీ నేను ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదు
భారత క్రికెటర్ షమీని కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. షమీపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన భార్య హసీన్... మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని తెలిపింది. ఒక పాకిస్థాన్ అమ్మాయి ద్వారా షమీ డబ్బు తీసుకున్నట్లు ఆరోపించింది. దీంతో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం విచారణ చేపట్టి, షమీని పలు ప్రశ్నలు అడిగింది. ఇందులో భాగంగా సమాధానాలు చెబుతూ.. తనది తప్పు అని తేలితే తనను ఉరి తీయండని మహమ్మద్ షమీ అన్నాడు. బీసీసీఐ తన వార్షిక కాంట్రాక్టును రద్దు చేసిందని, కానీ తాను ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని, ఇన్నాళ్లు తన గేమ్‌ను ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంతో నిజాయతీగా ఆడానని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.