air india: ఎయిరిండియా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన టర్కిష్ హ్యాకర్లు
- ఎయిరిండియా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు
- టర్కిష్ భాషలో మెసేజ్ పెట్టిన హ్యాకర్లు
- ఖాతాను పునరుద్ధరించిన అధికారులు
భారత విమానయాన సంస్థ ఎయిరిండియా అధికారిక ట్విటర్ ఖాతా @airindiain హ్యాకింగ్ కు గురైంది. నిన్న కొన్ని గంటల పాటు ఎయిరిండియా ట్విట్టర్ ఖాతా పని చేయకుండా పోయింది. ఈ సమయంలో ఆ ట్విట్టర్ ఖాతాలో టర్కిష్ భాషలో ‘చివరి నిమిషపు ముఖ్యమైన ప్రకటన.. మా అన్ని విమానాలు రద్దయ్యాయి. ఇక నుంచి మేము టర్కిష్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణాలు కొనసాగిస్తాం’ అంటూ ఒక సందేశాన్ని పోస్టు చేశారని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ఆ సందేశాలను తొలగించి ఖాతాను పునరుద్ధరించామని ఆయన చెప్పారు. కాగా, ఎయిర్ ఇండియా ట్విట్టర్ ఖాతాను సుమారు 1,46,000 మంది ఫాలో అవుతుండడం విశేషం.