dalermohandi: దలేర్ మెహందీ దోషే... మనుషుల అక్రమ రవాణా కేసులో న్యాయస్థానం తీర్పు
- 2000 సంవత్సరంలో పాప్ సింగర్ గా వెలుగు వెలిగిన దలేర్ మెహందీ
- దేశ విదేశాల్లో కచ్చేరీల నిర్వహణ
- విదేశాలకు అక్రమంగా మనుషులను తరలించాడని 31 కేసులు
ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ దలేర్ మెహందీని పటియాలా న్యాయస్థానం దోషిగా తేల్చింది. దాని వివరాల్లోకి వెళ్తే... 2003లో దలేర్ మెహందీ తన మ్యూజికల్ ట్రూప్ తో విదేశాల్లో కచేరీలు చేసేందుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో యూఎస్, కెనడాతో పాటు మరికొన్ని దేశాలకు కొందరితో ఒప్పందం చేసుకుని, వారిని ట్రూప్ లో సభ్యులుగా పేర్కొంటూ, అక్రమంగా మనుషులను తీసుకెళ్లేవాడు.
ఇటువంటి 31 కేసులు దలేర్ పై నమోదు కావడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. అనంతరం బెయిల్ పై దలేర్, ఆయన సోదరుడు షంషేర్ విడుదలయ్యారు. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం దలేర్, షంషేర్ లను దోషులుగా నిర్ధారించింది. దీంతో వారిద్దరూ న్యాయస్థానం కస్టడీలో ఉన్నారు. వారికి శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.