Sonia Gandhi: ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్ ప్లీనరీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న సోనియా గాంధీ!

  • ఢిల్లీలో కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం
  • బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసే వ్యూహం
  • రాహుల్ అధ్యక్షతన తొలి ప్లీనరీ

నేడు ఢిల్లీలో ప్రారంభం అవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని బీజేపీ ప్రభుత్వం తేల్చి చెప్పిన నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ తొలి నుంచీ చెబుతూ వస్తోంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పార్టీ ప్లీనరీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షత వహించనున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని మిగతా పార్టీలు ఏకమవుతున్న తరుణంలో మిత్రపక్షాలను ఒక చోటికి చేర్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న వ్యూహ రచన ఈ ప్లీనరీలో బయటపడే అవకాశం ఉంది. రెండు రోజులపాటు జరిగే ఈ ప్లీనరీలో 50 మంది నేతలు ప్రసంగించనుండగా వీరిలో 45 మంది 50 ఏళ్లలోపు వారు కావడం గమనార్హం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, చిదంబరం, గులాం నబీ ఆజాద్, షీలా దీక్షిత్, ఏకే ఆంటోనీ, వీరప్ప మొయిలీ తదితర సీనియర్ నేతలు కూడా ప్రసంగించనున్నారు. వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించకుండా సభ్యులను ఎన్నుకునే అధికారాన్ని ఈ ప్లీనరీ ద్వారా రాహుల్‌కు కల్పించనున్నారు.

  • Loading...

More Telugu News