Kamal Haasan: రజనీకాంత్ స్నేహాన్ని గుర్తు చేసుకుంటే బాధ కలుగుతోంది: కమలహాసన్

  • రాజకీయ పార్టీని ప్రారంభించిన కమలహాసన్
  • త్వరలోనే పార్టీని ప్రకటించనున్న రజనీకాంత్
  • ఇద్దరి మధ్యా స్నేహం సినిమాలకే పరిమితమన్న కమల్
  • తమ మార్గాలు వేరని, స్నేహం తెగడం బాధగా ఉందని వెల్లడి

ఇటీవలే 'మక్కల్ నీది మయ్యమ్' పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించిన విలక్షణ నటుడు కమలహాసన్, తన వెండి తెర మిత్రుడు రజనీకాంత్ తో స్నేహం చేసేది లేదని తేల్చారు. రాజకీయాల్లో రజనీకాంత్ ది ఆధ్యాత్మిక పార్టీ అని, తనది లౌకిక సిద్ధాంతమని, రెండు పార్టీల మార్గాలు వేరువేరని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల కారణంగా రజనీ వంటి వ్యక్తితో స్నేహాన్ని తెంచుకోవడం తనకు బాధగా ఉందని అన్నారు. ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తమ మధ్య అభిప్రాయభేదాలు నిజమేనని, రాజకీయాల్లో రజనీ ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారో తనకు తెలియదని అన్నారు.

తనకు మతాలన్నీ ఒకటేనని, ఆధ్యాత్మిక రాజకీయాలపై నమ్మకం లేని వ్యక్తినని కమల్ వ్యాఖ్యానించారు. సినిమా స్నేహాన్ని రాజకీయాల్లో ఆశించలేమని, ఒకరిని ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నానని అన్నారు. తమ మధ్య ఇప్పటికే దూరం ఏర్పడిందని, ఇది మరింతగా పెరుగుతుందన్న అనుమానాన్ని వ్యక్త పరిచిన ఆయన, రజనీని, ఆయనతో గత స్నేహాన్ని తలచుకుని, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే బాధ కూడా కలుగుతోందని, ఏది ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News