mamatha: మమతా బెనర్జీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ
- కోల్‌కతా సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్
- పుష్పగుచ్చం ఇచ్చి మమతా బెనర్జీ స్వాగతం
- సాయంత్రం 5 వరకు ఇరువురి మధ్య చర్చలు
- థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు, తదుపరి కార్యాచరణపై ముచ్చట
దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించేందుకు కోల్ కతా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విమానాశ్రయంలో ఆ రాష్ట్ర మంత్రి పూర్ణేన్ద్ బసు, ఉన్నతాధికారులు స్వాగతం పలికిన విషయం తెలిసిందే. కోల్ కతా విమానాశ్రయం నుంచి బయలుదేరి పశ్చిమ బెంగాల్ సచివాలయానికి చేరుకున్న కేసీఆర్ కు మమతా బెనర్జీ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.
అనంతరం వారిరువురూ చర్చలు ప్రారంభించారు. కేసీఆర్ వెంట ఎంపీ వినోద్ కుమార్ తో పాటు ఎంపీ కవిత, రాజ్యసభ సభ్యుడు కేశవరావు పలువురు అధికారులు ఉన్నారు. సాయంత్రం 5 వరకు మమతా బెనర్జీతో కేసీఆర్ చర్చించనున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ భేటీ ముగిసిన తరువాత కేసీఆర్ కోల్ కతా కాళీ మాత ఆలయంలో పూజలు నిర్వహించి, రాత్రి 8 గంటలకు హైదరాబాద్ బయలు దేరుతారు.