komat reddy: శాసనసభ సభ్యత్వాల రద్దుపై.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్‌లకు హైకోర్టులో కాస్త ఊరట
- సభ్యత్వాల రద్దుపై హైకోర్టులో విచారణ
- 6 వారాల వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వద్దని ఆదేశాలు
- కేసు తదుపరి విచారణ ఈ నెల 26 వరకు వాయిదా
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్స్ విసిరి దాడి చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై సదరు నేతలు హైకోర్టులో పిటిషన్ వేయడంతో దానిపై విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా నేతల నియోజక వర్గాలైన నల్గొండ, అలంపూర్ ఎన్నికలకు ఇప్పుడే నోటిఫికేషన్ ఇవ్వద్దని ఆదేశించింది.
కనీసం 6 వారాల వరకు ఆగాలని సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 26 వరకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. కాగా, ఈ వివాదంపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు లేదని, సభ్యత్వం రద్దు చేయాలంటే ముందు ఎథిక్స్ కమిటీకి సమస్య ను నివేదించాలని ఎటువంటి నిబంధనలు పాటించకుండానే తమ సభ్యత్వాలను రద్దు చేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ అంటున్నారు.