Undavalli: జగన్ కు ఈసారైనా అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి! : ఉండవల్లి అరుణ్ కుమార్
- గతంలో మోదీ, చంద్రబాబు, పవన్ ప్రభావంతో జగన్ ఓడిపోయారు
- పార్టీ ఫిరాయింపుదారులపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి
- రాజకీయం అన్న తర్వాత సామదాన భేదదండోపాయాలు తప్పవు
- ఇప్పుడు ఏ రాజకీయపార్టీకి ప్రిన్సిపుల్స్ లేవు : ఉండవల్లి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ కు గత ఎన్నికల్లో దురదృష్టం ఎదురైందని, ఈసారైనా అదృష్టం కలిసొస్తుందేమో చూడాలని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ‘ఐ డ్రీమ్స్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రభావంతో జగన్ ఓటమి పాలయ్యారని అన్నారు.
‘పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి. కానీ, ఆయన చర్యలు తీసుకోరు! పూర్వపు రాజకీయనాయకులందరూ గొప్పవాళ్లు .. ఇప్పుడున్న వాళ్లందరూ దుర్మార్గులని అనుకోవద్దు. ఎప్పుడైనా, రాజకీయం అన్న తర్వాత సామదాన భేదదండోపాయాలు ఉంటాయి. గాంధీ గారి టైమ్ నుంచి ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు, రాజకీయపార్టీలకు ప్రిన్సిపుల్స్ ఉండేవి.. ఇప్పుడు లేవు. ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకైనా వెళ్లొచ్చు. అధికారంలో ఉండాలన్నదే ప్రిన్సిపుల్. అదే జరుగుతోంది’ అని ఉండవల్లి అన్నారు.