National Highways: జాతీయ రహదారులన్నీ దిగ్బంధం... ఎక్కడికక్కడ ఆగిన బస్సులు... జనజీవనంపై ప్రభావం!

  • రహదారులపైకి పలువురు నాయకులు
  • కిలోమీటర్ల కొద్దీ నిలిచిన ట్రాఫిక్
  • విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ధర్నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పలు విపక్ష పార్టీలు జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునివ్వడం, అధికారంలో ఉన్న టీడీపీ సైతం దీనికి మద్దతు పలకడంతో, రాష్ట్రంలోని రోడ్లన్నీ స్తంభించిపోయాయి. పలు ప్రాంతాల్లో వామపక్ష, కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు తెలుగుదేశం నేతలు సైతం రోడ్లపైకి వచ్చి ధర్నాలకు దిగడంతో ప్రజా జీవితంపై ప్రభావం పడింది.

విజయవాడలో యువనేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వందలాది మంది జాతీయ రహదారిని అడ్డుకోవడంతో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. నెల్లూరు, కర్నూలు, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కాగా, శాంతియుత నిరసనలకు తాను మద్దతిస్తానని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం సహించేది లేదని చంద్రబాబునాయుడు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News