ubi: హైదరాబాదు, యూబీఐలో 1394 కోట్ల కుంభకోణం!

  • 1997లో గుడ్ గావ్ కేంద్రంగా ప్రారంభమైన టొటెం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ
  • టొటెం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా తొట్టెంపూడి సలలిత్
  • యూబీఐ కన్సార్టియం నుంచి 1394 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న టొటెం సంస్థ

హైదరాబాద్‌ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1394 కోట్ల రూపాయల కుంభకోణం వెలుగు చూడడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌ కు చెందిన టొటెం ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనే నిర్మాణ సంస్థ ఈ కుంభకోణానికి పాల్పడింది. ఈ వివరాల్లోకి వెళ్తే... టొటెం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 1997లో హరియాణాలోని గుడ్‌ గావ్‌ కేంద్రంగా ఏర్పాటైంది. దీనికి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా తొట్టెంపూడి సలలిత్‌ వ్యవహరిస్తున్నారు. టొటెం సంస్థ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లీడ్‌ బ్యాంక్‌ గా ఉన్న ఎనిమిది బ్యాంకుల కన్సార్టియం నుంచి 1394 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది.

 ఈ మొత్తాన్ని ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి, వాటిల్లోకి జమ చేశారు. వేతనాలు, ఇతర ఖర్చులను భారీగా చూపుతూ ఆయా బ్యాంకు ఖాతాల్లోకి ఆ మొత్తాన్ని మళ్లించారు. ఆ తరువాత రుణాలు చెల్లించకుండా టొటెం సంస్థ చేతులెత్తేసింది. దీంతో 2012 జూన్‌ 30న వీటిని వసూలు కాని మొండి బకాయిలుగా యూబీఐ ప్రకటించింది. అనంతరం ఈ సంస్థ లావాదేవీలన్నీ కన్సార్టియంలో ఉన్న 8 బ్యాంకుల్లో కాకుండా ఇతర బ్యాంకుల ద్వారా నిర్వహించినట్టు ఆడిట్ అధికారులు గుర్తించారు. దీంతో సీబీఐకి యూబీఐ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన సీబీఐ, హైదరాబాదులోని టొటెం సంస్థ కార్యాలయంతో పాటు డైరెక్టర్లు సలలిత్‌, లలిత ఇళ్లల్లో సోదాలు నిర్వహించి ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.

  • Loading...

More Telugu News