edida sriram: నాన్నగారు ఏ సినిమా మొదలుపెట్టినా ఎన్నో విమర్శలు వచ్చేవి!: ఏడిద శ్రీరామ్
- నాన్నగారి అభిమాన దర్శకులు విశ్వనాథ్ గారు
- ఆయనతోనే 'సిరి సిరి మువ్వ' చేశారు
- అలాంటి విమర్శలు వచ్చాయి
ఏడిద నాగేశ్వర రావు నిర్మాణంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలను గురించి ఆయన తనయుడు శ్రీరామ్.. తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడారు. 'సిరిసిరి మువ్వ' సినిమాను విశ్వనాథ్ గారితోనే చేయాలని నాన్నగారు అనుకున్నారు. అందుకోసం విశ్వనాథ్ గారిని తరచూ కలిసేవారు.
ఈ సినిమా నిర్మాణం కొనసాగుతున్నప్పుడు .. 'హీరో డప్పుకొట్టేవాడు .. హీరోయిన్ మూగది .. ఈ సినిమా ఎవరు చూస్తారు?' .. 'ఈ సినిమాతో 'సిరి' మిగులుతుందో .. మువ్వలు మిగులుతాయో చూడాలి' అనే విమర్శలు వచ్చాయి. ఇక 'తాయారమ్మ బంగారయ్య' సినిమా అప్పుడు .. వయసైపోయిన వాళ్లతో సినిమా ఏంటని అనుకున్నారు. 'శంకరాభరణం ' సినిమాకి కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. కానీ నాన్నగారి నమ్మకం నిజమైంది .. ఆ సినిమాలన్నీ ఘన విజయాలను సాధించాయి .. కళాఖండాలుగా మిగిలిపోయాయి" అని చెప్పుకొచ్చారు.