tv: రేటింగ్స్ కోసం ట్యాంపరింగ్‌కు పాల్పడుతోన్న కొన్ని టీవీ ఛానెళ్లు
- యాడ్స్ కోసం అడ్డదారులు తొక్కుతోన్న టీవీ ఛానెళ్లపై బార్క్ సీరియస్
- ట్యాంపరింగ్‌పై పూర్తి ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు
- పోలీసుల అదుపులో ట్యాంపరింగ్‌కు పాల్పడుతోన్న ఐదుగురు
- రేటింగ్ మీటర్లను ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించిన బార్క్
రేటింగ్‌ల కోసం కొన్ని టీవీ ఛానెళ్లు అడ్డదారులు తొక్కుతున్నట్లు బార్క్ (బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) తెలిపింది. కొందరు రేటింగ్ మీటర్లను ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించిన బార్క్.. ఈ విషయంపై పూర్తి ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేటింగ్‌లు ప్రభావితం చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. వారిపై మోసం, నమ్మక ద్రోహం కేసులు నమోదు చేశారు.
ట్యాంపరింగ్‌కు పాల్పడుతోన్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బార్క్ సీఈవో పార్థోదాస్ గుప్తా ఈ విషయంపై మాట్లాడుతూ... ఇటువంటి చర్యలను ఉపేక్షించబోమని అన్నారు. బార్క్ సంస్థ ఇచ్చే రేటింగ్‌లే ప్రామాణికంగా టీవీ చానెళ్లకు ప్రకటనలు ఉంటాయని, ప్రకటనల కోసం ట్యాంపరింగ్‌ను కొన్ని టీవీ ఛానెళ్లు ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు.