AAP: 20 మంది ఆప్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట!
- 20 మంది ఎమ్మెల్యేలు ఇతర లాభదాయక పదవుల్లో ఉన్నారని ఆరోపణలు
- వారిపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫార్సు
- వేటు పడడంతో హైకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎమ్మెల్యేలు
- అనర్హత వేటును పక్కనబెట్టిన హైకోర్టు
లాభదాయక పదవుల వ్యవహారంలో 20 మంది ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. సదరు ఆప్ ఎమ్మెల్యేల అనర్హత వేటును హైకోర్టు రద్దు చేసింది. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు ఇతర లాభదాయక పదవుల్లో ఉన్నారని పేర్కొంటూ వారిపై అనర్హత వేటు వేయాలని కొన్ని రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది.
మొత్తం 21 మంది ఎమ్మెల్యేలపై లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నట్టు ఆరోపణలు రాగా, ఒకరు రాజీనామా చేయడంతో వీరి సంఖ్య 20 అయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి చేసిన సిఫార్సు ఆమోదం పొందడంతో ఈ 20 మందిపై వేటు పడింది. దీంతో ఈ సిఫార్సును వ్యతిరేకిస్తూ ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ రోజు వారికి న్యాయస్థానం నుంచి ఊరట లభించింది.