amith shah: సభను సాగనివ్వడం వారికి ఇష్టం లేదు: అమిత్ షా విమర్శలు
- అవిశ్వాస తీర్మానంపై స్పందించిన అమిత్ షా
- అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి మాకు తగినంత మెజార్టీ ఉంది
- ఉభయసభలను ప్రతిపక్షాలు స్తంభింపజేయడం సరికాదు
- విపక్షాలు లేవనెత్తుతున్న ప్రతి అంశంపైనా చర్చకు సిద్ధం
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతోన్న విషయం తెలిసిందే. గువహాటిలో తాజాగా నిర్వహించిన బీజేపీ బూత్ యూనిట్ సమావేశంలో ఈ విషయంపై స్పందించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తమకు తగినంత మెజార్టీ ఉందన్నారు. ఉభయసభలను ప్రతిపక్షాలు స్తంభింపజేయడంపై సరికాదని, విపక్షాలు లేవనెత్తుతున్న ప్రతి అంశంపైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ సభను సాగనివ్వడం లేదని చెప్పుకొచ్చారు.
కాగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని 25 ఎంపీ స్థానాలకు గాను 21 స్థానాలకు పైగా కైవసం చేసుకోవాలని అమిత్ షా తమ తన పార్టీ నేతలతో అన్నారు. ఇదే తాను 2019 ఎన్నికల కోసం తమ నేతలు, కార్యకర్తలకు ఇస్తోన్న లక్ష్యమని అన్నారు.