akash ambani engagement: అంబానీ ఇంట పెళ్లి సందడి: ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల నిశ్చితార్థం!
- గోవాలో నిన్న జరిగిన కార్యక్రమం
- శ్లోకాను తమ కుటుంబంలోకి ఆనందంగా ఆహ్వానిస్తున్నాం
- ఆకాశ్ అంబానీ తల్లి నీతా అంబానీ
దేశంలోనే అత్యంత ధనికుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యాధినేత ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, రస్సెల్, మోనా మెహతా దంపతుల కుమార్తె శ్లోకా మెహతాను పెళ్లి చేసుకోనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఆకాశ్ అంబానీ, శ్లోకా నిశ్చితార్థం గోవాలో శనివారం జరిగింది. ముకేశ్ అంబానీ దంపతులు, అటు రస్సెల్ మెహతా దంపతుల సమక్షంలో ఇది జరిగింది.
ఆకాశ్ ఎడమ చేతిపై శ్లోకా తన ఎడమ చేతిని ఉంచి అడుగులు వేస్తున్న ఫొటో, శ్లోకాకు ముకేశ్ అంబానీ స్వీట్ తినిపిస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే, వివాహం ఎప్పుడన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. శ్లోకా మెహతా, ఆకాశ్ అంబానీ ఇద్దరూ ధీరుబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో కలసి చదువుకున్నారు.
అప్పటి నుంచి ఉన్న పరిచయంతో వారు ఒక్కటవుతున్నారు. శ్లోకా తండ్రి రోజీ బ్లూ డైమండ్స్ అనే ఓ పెద్ద డైమండ్స్ కంపెనీ అధినేత. ఈ విషయమై అకాశ్ తల్లి నీతా అంబానీ స్పందిస్తూ... శ్లోకా నాలుగేళ్ల వయసు నుంచి తనకు తెలుసునని, ఆమెను తమ కుటుంబంలోకి ఆనందంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు.