Islamic State (IS): ఉగ్రవాదుల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చేస్తున్న ఆఫ్ఘన్ బలగాలు
- గడచిన 24 గంటల్లో 63 మంది ఉగ్రవాదుల కాల్చివేత
- కాంధహార్, పాక్తియా, ఉరుజ్గన్ ప్రావిన్సుల్లో ఏరివేత ఆపరేషన్
- కాల్చివేత అనంతరం ఉగ్రవాదుల నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాల స్వాధీనం
ఆఫ్ఘనిస్తాన్ భద్రతా దళాలు గడచిన 24 గంటల్లో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కి చెందిన 14 మంది ఉగ్రవాదులు సహా కనీసం 63 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లను ఫరా, కాంధహార్, పాక్తియా, ఉరుజ్గన్, నంగర్ హర్ ప్రావిన్సుల్లో శనివారం చేపట్టినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపినట్లు తోలో న్యూస్ ఉటంకించింది.
ఉగ్రవాదులను హతమార్చిన అనంతరం వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని రక్షణ శాఖ ఉప ప్రతినిధి మహ్మద్ రద్మానిష్ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఏ ఒక్క ఉగ్రవాద సంస్థ కూడా స్పందించలేదని ఆయన చెప్పారు.